నమస్తే శేరిలింగంపల్లి : వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో దొంతి జగదీశ్ చంద్రప్రసాద్ (మహదేవ్ యూత్) ఆధ్వర్యంలో ఘనంగా అన్నసమారాధన నిర్వహించారు.
అయితే వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు చందానగర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డా.మాధవరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, అరుణ్ కుమార్, హనుమంత్ నాయక్, సాయి, విశ్వా, చరణ్, శివ పాల్గొన్నారు.