నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ మార్తాండ నగర్ లో జన సంఘ్ వ్యవస్థాపకుడు స్వర్గీయ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గణేష్ టెంపుల్ ఆవరణలో ఆయన పేరుకు గుర్తుగా మొక్కలను నాటారు.