- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏడు మురుగునీటి శుద్ధి కేంద్రాలకు నిధులు మంజూరు
- దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్ డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
నమస్తే శేరిలింగపల్లి : స్వచ్ఛమైన నీటితో కూడిన చెరువులను ప్రజలకు అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్ డీ సామర్థ్యంతో రూ. 15 కోట్ల అంచనావ్యయంతో మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ)ను ఎమ్మెల్సీ సురభి వాణి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగరావుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ. 15. కోట్ల అంచనావ్యయంతో ఎస్టీపీని ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. దుర్గం చెరువు పరిసర ప్రాంతం కాలనీ వాసులకు నేటితో ఎంతో ఉపశమనం కలిగినదని, మురుగు నీటి నుండి చెరువులకు విముక్తి కలిపించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 772 ఎంఎల్‌డీ సీవరేజ్ ప్లాంట్లకు అదనంగా 1260 ఎంఎల్‌డీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని, ఫలితంగా 31 ప్రాంతాల్లో ఈ సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అయితే 31 మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసే ఏడు ఎస్టీపీలకు నిధులు మంజూరి చేసిన శుభసందర్భంగా హైదరాబాద్ ప్రజల తరపున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు హృదయపూర్వకమైన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంజూరయిన ఏడు (ఎస్టీపీ) మురుగు నీటి శుద్ధి కేంద్రాల వివరాలు
1. మియాపూర్ పటేల్ చెరువు 7.0 ఎంఎల్డీ కెపాసిటీ – అంచనావ్యయం 26.27 కోట్లు
2. గంగారాం పెద్ద చెరువు – 20.0 ఎంఎల్డీ కెపాసిటీ – అంచనావ్యయం 64.14 కోట్లు
3.కాజాగుడా చెరువు.- 21.0 ఎంఎల్డీ కెపాసిటీ – అంచనావ్యయం 61.25 కోట్లు
4.అంబిర్ చెరువు 37.0 ఎంఎల్డీ కెపాసిటీ – అంచనావ్యయం100.87 కోట్లు
5.ఎల్లమ్మ కుంట చెరువు జయనగర్ – 13.50 ఎంఎల్డీ కెపాసిటీ – అంచనావ్యయం 43.46 కోట్లు
6. పరికి చెరువు – 28.0 ఎంఎల్డీ కెపాసిటీ – అంచనావ్యయం 83.05 కోట్లతో ఆయా నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.