అన్ని వర్గాల అభివృద్ధికే…భారత చైతన్య యువజన పార్టీ

  • భారత చైతన్య యువజన పార్టీకి మద్దతు తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య వేదిక ప్రజా సింహ గర్జన సభ నిర్వహించారు. బోడె రామచంద్ర యాదవ్ అధ్యక్షతన భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించింది. ఇది బీసీల సమస్యలకు పరిష్కారాలు చూపడానికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టి, వెనుకబడిన అన్ని వర్గాల జాతులను అభివృద్ధి చేయడానికి ఈ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.

ఈ సభకు రెండు రాష్ట్రాల నలుమూలల నుండి విచ్చేసిన అభిమానులకు, రైతులకు, అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు.. ముఖ్యంగా ప్రజాసింహ గర్జన ప్రకటించినప్పటి నుంచి నేటివరకు అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మన పోరాటం.. మన ఆశయం సాధించే వరకు కొనసాగిద్దామని దీనికి నేను అండగా ఉంటానని, కర్తగా ఉంటానని, కర్మగా ఉంటానని మాటిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పత్రిక యాజమాన్యాలకు పాత్రికేయ మిత్రులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఇప్పటికి బీసీ, ఎస్టీ,ఎస్సీ, మైనార్టీలను అగ్రవర్ణ కులాలు అణగదొక్కుతూనే కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. అధికార బదలాయింపు జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. దామాషా పద్ధతిలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అన్ని రంగాల్లో సీట్లు కేటాయించాలని అన్నారు.

ముఖ్యంగా రాజకీయాల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు సీట్లు కేటాయించాలని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి యువతరం తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అని అన్నారు బీసీల సమస్యలు పరిష్కరించాలంటే బీసీలే నేతలుగా ఉండాలని అన్నారు. అందరూ ఏకమై బీసీ ల హక్కుల పోరాడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి భారీ ఎత్తున చిన్న శ్రీశైలం యాదవ్ యూసుఫ్ గూడా వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు. బిల్డర్ ప్రసాద్ యాదవ్, పోలీస్ వెంకటేష్ యాదవ్, పాములేటి యాదవ్, అందెల కుమార్ యాదవ్, బిల్డర్ హరిబాబు యాదవ్, సిహెచ్ యాదవ్, బిల్డర్ మాధవ్, బిల్డర్ శివకుమార్ యాదవ్, వేణు యాదవ్, నవీన్ యాదవ్, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజా సింహ గర్జన సభను విజయవంతం చేశారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here