నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కి చెందిన సాయి కార్తీక్ ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరైంది. రూ. 50 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలబడుతున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉరిటీ వెంకట్రావు పాల్గొన్నారు.





