నల్లగండ్ల హుడా కాలనీలో సమస్యలు పరిష్కరించండి

  • నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
  • అనంతరం సమస్యలు పరిష్కరించాలని వినతి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి . అనంతరం పూల మొక్కను అందజేసి డివిజన్ లోని పలు సమస్యలపై ఆయనతో సమావేశమయ్యారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్డు, తాగునీరు , విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అంతేకాక హుడా కాలనీలోని పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలేందర్ రెడ్డి, నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షులు రంజిత్ పూరి, ప్రధాన కార్యదర్శి భరత్, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here