- హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీలో రూ. 35 లక్షల అంచనావ్యయంతో యూజీడీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి: డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీలో రూ. 35 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే యూజీడీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా యూజీడీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. దింతో హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీలో ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరునని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజి పడకూడదని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి డిజిఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవరం గోపాల్ రావు, ఓ. వెంకటేష్, నాగరాజు, దేవేందర్, నరేందర్ బల్లా, సికేందర్, దీక్షిత్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఉదయ్ కుమార్, వెంకట్ రెడ్డి, రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.