- నివాళి అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఆల్విన్ కాలనీ లోని పటేల్ కుంట పార్క్ వద్ద పార్టీ కార్యాలయంలో నిర్వహించగా.. బీజేపీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్. ఈ సందర్బంగా మాట్లాడుతూ అఖండ భారతావనిలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం ఉండాలని గట్టిగా చెప్పిన గొప్ప మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు. జాతీయ సమగ్రత, దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే నాటి నెహ్రూ విధానాలను తీవ్రంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి సరామరాజు, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, ఆంజనేయులు యాదవ్, సీతారామరాజు, రఘు, రామ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సందీప్ గౌడ్, సుధాకర్ ,సురేష్ అనిత, సైదమ్మ, నర్సింగ్, నరేష్, కృష్ణ పాల్గొన్నారు