అర్హులందరికీ త్వరగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలి

  •  జనసేన పార్టీ డిమాండ్.. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావుకు వినతి

నమస్తే శేరిలింగంపల్లి : పేద ప్రజల పక్షాన జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావుకు వినతి పత్రం సమర్పించారు.

కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ఆలోచన లేదని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారని అన్నారు. దీంతో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమండ్ చేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని, లేకుంటే పేద ప్రజల తరపున జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, జీస్ కే శ్రావణ్, అరుణ్ కుమార్, ప్రవీణ్ సాహు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here