- ఘనంగా నివాలులర్పించిన కార్పొరేటర్లు, ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి.. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం.. సాయుధ పోరాటం తోనే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడు.. ఆ మహనీయుడి126 వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని జె. పి.ఎన్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని , మన్యం ప్రజలలో విప్ల బీజాలు నాటి ప్రజలను చైతన్య పరిచి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచిన మహానుభావుడు అల్లూరి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గంగాధర్, బీఎస్ ఎన్ కిరణ్ యాదవ్, చంద్రిక ప్రసాద్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, దుర్గరాజు, పవన్, రంగరాజు,కృష్ణంరాజు, గంగాధర్, దీప్తి కృష్ణంరాజు, కాట్రగడ్డ సత్యనారాయణ, వర్మ, శివ, బలరామకృష్ణ, రవి,సత్యనారాయణ రాజు, సూరి, నాగరాజు క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.