హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్లో వరద ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె బాధితులను పరామర్శించారు. కేవలం రూ.10వేలతోనే సరిపెట్టకుండా అవసరం అయితే ప్రభుత్వం ఇంకా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఆమె వెంట జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.







