ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ కాలనీలో వరద బాధితులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డు సభ్యులు చిన్న శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, నాయకులు బోయ కిషన్, సల్మా రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మహేందర్ రెడ్డి, సత్యనారాయణ, నాగేశ్వరరావు, గోపాల్, ఆది కేశవులు, లింగారెడ్డి పాల్గొన్నారు.

