మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ పాఠశాలలను ఆదుకోవాలని ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కలివేముల మనోహర్ తన కుమార్తె సాహితి జన్మదినం సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల వేతనం నిమిత్తం రూ.51వేలను శ్రీ సరస్వతీ విద్యాపీఠం దుందిగల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయణకి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ ప్రధాన కార్యదర్శి మహేష్, కలివేముల యాదగిరి, సాయి వివేక్ పాల్గొన్నారు.