మాదాపూర్‌లో ర‌క్త‌దాన శిబిరం

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా త‌ల‌సేమియా వ్యాధిగ్ర‌స్తుల స‌హాయార్థం మాదాపూర్ పోలీసులు, త‌ల‌సేమియా, సికిల్ సొసైటీల సంయుక్త ఆధ్వ‌ర్యంలో గురువారం మాదాపూర్ సాయి గార్డెన్‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 104 యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించారు. అనంత‌రం ర‌క్త‌దాత‌ల‌ను డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు అభినందించారు. వారికి ధ్రువ‌ప‌త్రాల‌ను ఆయ‌న అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏసీపీ ర‌ఘునంద‌న్ రావు, సీఐ ర‌వీంద్ర ప్ర‌సాద్‌, ఎస్ఐలు రామ్ మోహ‌న్ రెడ్డి, వీర ప్ర‌సాద్‌, స్థానిక కాంగ్రెస్ నాయ‌కుడు గంగ‌ల రాధాకృష్ణ యాద‌వ్‌, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

ర‌క్త‌దాన శిబిరంలో పాల్గొన్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు
ర‌క్త‌దాత‌కు ధ్రువ‌ప‌త్రాన్ని అంద‌జేస్తున్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here