- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ ఫేజ్ 2 కాలనీలో రూ.25 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా మెయిన్ రోడ్డులో గుంతలు ఏర్పడటం వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో వారి కోరిక మేరకు సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేసి రోడ్డును కాలనీ వాసులకు, వాహదారులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆమె వెంట పారునంది శ్రీకాంత్, అనంత్ రెడ్డి, నీలకంఠ రెడ్డి, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, పాపిరెడ్డి, రాజేష్ దూబే, వెంకటేశ్వర రావు, రాజేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఉన్నారు.