నాయిని మ‌ర‌ణం రాష్ట్రానికి తీర‌ని లోటు

  • నార్నె శ్రీనివాసరావు

హైదర్ నగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నాయిని నర్సింహారెడ్డి మరణం తెరాస పార్టీకి తీరని లోట‌ని హైదర్ నగర్ డివిజ‌న్‌ తెరాస అధ్యక్షుడు నార్నె శ్రీనివాసరావు అన్నారు. డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడు నాయిని అని కొనియాడారు. కార్మిక నాయకుడిగా ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పాటుప‌డిన‌ గొప్ప వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి అని, తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా పోలీసు శాఖ బలోపేతానికి కృషి చేసిన నర్సన్న మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోట‌ని పేర్కొన్నారు. నాయిని నర్సింహారెడ్డి కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నాయిని నర్సింహారెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన నార్నె శ్రీనివాసరావు, తెరాస నాయ‌కులు

ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కోనేరు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, వార్డ్ మెంబర్ రావూరి సైదేశ్వర్ రావు, ఏరియా కమిటీ మెంబర్ పర్వీన్ సుల్తానా, సద మాధ‌వి, తెరాస నాయకులు రంగరాయ ప్రసాద్, అష్రాఫ్, షరీఫ్, హమీద్, సద్దాం హుస్సేన్, అనిల్ భాయ్, సత్తార్, కృష్ణ, సద బాలయ్య, సద మహేష్, సద దానయ్య, ల‌త‌, జ్యోతి, జుబేదా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here