వరదనీటిలో పుస్తకాలు తడిచి పోయిన విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ చేయూత

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వరద నీటిలో పుస్తకాలు తడిచిపోయి, చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ చేయూతనందించింది. పదవతరగతి, ఇంటర్ కు చెందిన ఆరుగురు విద్యార్థులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ పుస్తకాలు అందజేశారు.

విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కొండా విజయ్ కుమార్

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కష్టకాలంలో ఇతరుల అవసరాలను గుర్తెరిగి సహకారం అందించడం దైవకార్యంతో సమానమని అన్నారు. ఆ మార్గంలో పయనిస్తున్న హోప్ పౌండేషన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, పౌండేషన్ ప్రతినిధులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి, సంతోష్, కంది జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాల పొందిన విద్యార్థులతో ప్రభుత్వ విప్ గాంధీ, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here