- రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహంతో ముంపునకు గురై నష్టపోయిన బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పేర్కొన్నారు. ముంపు బాధితులకు తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన రూ. 10 వేల నగదును రాగం సుజాత యాదవ్ బుధవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ లో 8 మంది బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున అందజేశారు.
ముంపు బాధితులు అధైర్యపడకూడదని, వారికి ఎప్పటికప్పుడు తక్షణ సహాయ చర్యలు అందజేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనుక్షణం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాగం సుజాత యాదవ్ అన్నారు. ముంపు బాధితులకు అండగా ఉంటామని ఈ తక్షణ సహాయమే నిదర్శనమన్నారు. రాగం సుజాత యాదవ్ వెంట ఏఈ సునీల్, రాము, నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాజు నాయక్, బాబర్ ఉన్నారు.