వ‌ర‌ద ప్రాంతాల్లో శానిటైజేష‌న్ చ‌ర్య‌లు

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లో వరద ముంపు ప్రాంతంలో డీసీ వెంకన్న, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా చేప‌ట్టిన‌ నాలా పూడికతీత పనులను వారు పరిశీలించారు. అనంత‌రం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంప‌ల్లిలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో శానిటైజేష‌న్ చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. డీఆర్ఎఫ్ వాహ‌నాల ద్వారా ముంపు ప్రాంతాల్లోని కాల‌నీల్లో, నాలాల‌కు ఇరువైపులా హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారీ చేయిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. త‌మ త‌మ ఇంటి ప‌రిస‌రాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE శ్రీనివాస్, AMOH రంజిత్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు , మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్ , మోహన్ గౌడ్ , డివిజన్ తెరాస అధ్య‌క్షులు మారబోయిన రాజు యాదవ్ , ఉప్పలపాటి శ్రీకాంత్,హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ , తెరాస నాయకులు పద్మా రావు , చింత కింది రవీందర్, కొండల్ రెడ్డి , కృష్ణ యాదవ్ , లింగం శ్రీను , నటరాజు, గోపి కృష్ణ, రమణ , కవిత స్థానికులు పాల్గొన్నారు.

తారాన‌గ‌ర్‌లో నాలాలో జేసీబీతో పూడిక తీత ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డీసీ వెంక‌న్న‌, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
స్థానికుల‌తో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డీసీ వెంక‌న్న‌, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

మియాపూర్‌, చందాన‌గ‌ర్‌ల‌లో…

మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం చెరువు ఔట్ లెట్ లను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ఎక్కడికక్కడ ఔట్ లెట్ లను శుభ్రం చేయడం జరిగింద‌ని తెలిపారు. ఔట్ లెట్ ల‌లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి, మోటార్ల ద్వారా నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చేశామని అన్నారు. దీని వ‌ల్ల కాల‌నీలు, బ‌స్తీల్లో వరద ముంపు తగ్గి ప్ర‌జ‌ల‌కు ఉపశమనం లభించింద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ పాల్గొన్నారు.

మియాపూర్ ప‌టేల్ చెరువును ప‌రిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here