సంక్షేమ పథకాల అమలులో తెలంగాణే నెం.1 : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • 300 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, భారతి నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద నగర్, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 34 వేల 800లు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయాన్ని మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి లబ్దిదారులకు అందచేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్న చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కార్యక్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్, కూకట్ పల్లి తహసీల్దార్ గోవర్ధన్, ఆర్ ఐ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, నాగమణి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీను పటేల్ మాధవరం గోపాల్ రావు, ఎండీ. ఇబ్రహీం, మిద్దెల మల్లారెడ్డి, నర్సింహ సాగర్, సైదేశ్వరరావు, రాంచందర్, అనిల్ కావూరి, అశోక్, కార్తిక్ గౌడ్, సందీప్, యాదగిరి, చంద్రిక ప్రసాద్ గౌడ్, రోజా, సుప్రజ, లత, కల్పన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here