శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రశాంత్ నగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్వకేట్ దాసోజు శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్ బోటిక్ ప్రొప్రైటర్ కుశాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధి కోసం, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న దాసోజు శ్రీనివాస్ సేవలను అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చంద్రశేఖర్ రెడ్డి, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, మౌలానా, చంద్రశేఖర్, అశోక్, సంతోష్‌తోపాటు శ్రీనివాస్ అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.





