మియాపూర్‌లో శరన్నవరాత్రి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఉదయ్ కిరణ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని ఎఫ్‌సీఐ కాలనీ పార్క్‌లో ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి-దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డాక్టర్ యలమంచి ఉదయ్ కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యలమంచి ఉదయ్ కిరణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులు చంద్ర మౌళి, ఆనంద్, మహేందర్ తదితరులు డాక్టర్ యలమంచి ఉదయ్ కిరణ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో నాయుడు, నాగిరెడ్డి, గంగాధర్, సంజయ్, శరత్, కామినేని వాసు, వంశీ, నాని, అశోక్, ప్రవీణ్, రాజశేఖర్, రత్నాచారి, వినోద్, శశి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి వెల్లివిరియాలని ఈ సందర్భంగా నిర్వాహకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here