శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ 48 కార్యాలయంలో పలు కీలక అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్ ఉప కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లు, ఈఎస్‌ఐ (ESI), ఈపీఎఫ్ (EPF) బడ్జెట్లు, బహిరంగ చెత్త నిల్వ ప్రాంతాల (GVPs) నిర్మూలన, టౌన్ ప్లానింగ్ సర్వే నంబర్లు, పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు, నిర్ణీత గడువు దాటిన ఫిర్యాదులపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా అన్ని పెండింగ్ అంశాలను పరిష్కరించి, ప్రజలకు అందించే సేవలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.






