టీడీపీ జెండాలను తొలగించినప్పుడు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించలేవా..?: కట్టా వెంకటేష్ గౌడ్

  • శేరిలింగంపల్లి లో ఫ్లెక్సీల రగడ
  • టిడిపి ఫ్లెక్సీల ను తొలగించిన జీహెచ్ఏంసీ అధికారులు
  • చందానగర్ సర్కిల్ ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా

నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సంసిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే మియాపూర్ ఆల్విన్ చౌరస్తా నుండి కొండాపూర్ వరకు లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా జీహెచ్ఎంసీ అధికారులు వేడుకలు మొదలవ్వక ముందే అంటే బుధవారం ఉదయమే వాటిని పూర్తిగా తొలగించడం విశేషం. ఐతే బీఅర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన ఫ్లెక్సీల జోలికి పోకుండా కేవలం టీడీపీ పార్టీ వారు ఏర్పాటు చేసిన జెండాలనే తొలగించడం చర్చనీయాంశం అయ్యింది. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే అధికారులు ఫ్లెక్సీలు తొలగించారని టీడీపీ పార్టీ వారు ఆరోపిస్తున్నారు.

చందానగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టిడిపి శ్రేణులు

ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ఇంచార్జీ కట్టా వెంకటేష్ గౌడ్ అధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ జీహెచ్ఏంసీ చందానగర్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. అధికారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని వారి ఫ్లెక్సీలు తొలగించకుండా మా పార్టీ వి తొలగించడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ గౌడ్, ఏరువ సాంబశివ గౌడ్, రజినీకాంత్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here