సమరశీల ఐక్య పోరాటాలే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం

  • జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు తుడుం అనిల్ కుమార్ 

నమస్తే శేరిలింగంపల్లి : కార్మిక హక్కుల ను కాలరాస్తున్న మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు తుడుం అనిల్ కుమార్ పిలుపు నిచ్చారు. ఓంకార్ భవన్ బాగ్ లింగం పల్లి హైదరాబాద్ లో కామ్రేడ్ టి.అనిల్ కుమార్ అధ్యక్షతన ఎఐసీటీయూ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ ఆయన పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయంగా కార్మిక వర్గంలో వస్తున్న మార్పులు, దేశంలో, రాష్ట్రంలో కార్మిక భద్రతకు సమస్యలు ఎదురవుతున్నాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నదని, నిరుద్యోగాన్ని పెంచి పేదరికాన్ని పెంచిపోషిస్తున్నదని తెలిపారు. 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చి సమ్మె హక్కును సంఘం పెట్టుకునే హక్కు ను బిజెపి తొలిగిస్తుందని ఫలితంగా బహుజన వర్గాలకు చెందిన కార్మిక వర్గం ఉపాధి ఉద్యోగం కోల్పోయి లక్షలాదిమంది రోడ్డున పడుతున్నారని, ఈ విధానానికి వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు.

 

సమావేశంలో మాట్లాడుతున్న తుడుం అనిల్ కుమార్

ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎర్ర రాజేష్ మాట్లాడుతూ.. రానున్న మేడేను కార్మిక వర్గం హక్కులను కాపాడటం కోసం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వీఆర్ఓ, వీఆర్ఏ, అంగన్ వాడీల సమస్య, ఆర్ టి సి, సింగరేణి, ఎలక్ట్రిసిటీ కార్మిక సమస్యలు, భవన నిర్మాణ కార్మికులు, మార్కెట్ దాడువాయి, హమాలీ, ఇంకా ఇతర రంగాల కార్మిక వర్గం సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విస్మరణకు వ్యతిరేకంగా చైతన్యవంతమైన పోరాటాల ద్వారానే కార్మికవర్గం హక్కులను పరిరక్షించేందుకు పూనుకుందామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. పురుషోత్తం, రాష్ట్ర కమిటీ సభ్యులు కర్ర దానయ్య, రావుల ఝాన్సీ, శివాని, సైదులు, చందర్, నాగరాజు, ఆశీర్వాదం, వెంకన్న, జైపాల్, యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here