శిల్పా, అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌ల‌లో సామూహిక అక్ష‌రాభ్యాసం

అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్ సాయిబాబ దేవాల‌యంలో శ్రీ స‌ర‌స్వ‌తీ దేవిగా పూజ‌లందుకుంటున్న అమ్మ‌వారు

– ఐద‌వ రోజు శ్రీ స‌ర‌స్వ‌తీ దేవి అవ‌తారంలో క‌నువిందు చేసిన అమ్మ‌వారు
చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శార‌దాపీఠ పాలిత శ్రీ షిర్డి సాయిబాబా, అన్న‌పూర్ణా స‌మేత కాశీ విశ్వేష్వ‌రాల‌యంలో శ్రీ దేవి శ‌రన్న‌వ‌రాత్రి ఉత్ర‌వాలు ఐద‌వ రోజు వైభ‌వంగా కొన‌సాగాయి. బుద‌వారం అమ్మ‌వారు శ్రీ స‌ర‌స్వ‌తీ దేవి అలంక‌ర‌ణ‌లో భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సాముహిక అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. పురోహితుల వేద మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ ప‌రిస‌ర ప్రాంతాల త‌ల్లితండ్రులు త‌మ పిల్ల‌ల‌చే స‌ర‌స్వ‌తీ దేవి స‌మ‌క్షంలో అక్ష‌రాలు దిద్దించారు.

శిల్పా ఎన్‌క్లేవ్ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో శ్రీ స‌ర‌స్వ‌తీ దేవి అలంక‌ర‌ణ‌లో భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తున్నఅమ్మ‌వారు

చందాన‌గ‌ర్ శిల్ప ఎన్‌క్లేవ్‌లోని శ్రీ ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి దేవాల‌యంలో శ్రీ దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో ఐద‌వ రోజు అమ్మ‌వారు శ్రీ స‌ర‌స్వ‌తి దేవి అవ‌తారంలో భ‌క్తుల‌ను ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సామూహిక అక్ష‌రాభ్యాసం కార్య‌క్ర‌మంలో ప‌రిస‌ర ప్రాంతాల త‌ల్లితండ్రులు పాల్గొని త‌మ పిల్ల‌ల‌చే అక్ష‌రాభ్యాసం చేయించారు. శ్రీ స‌ర‌స్వ‌తీ దేవి అలంక‌ర‌ణ‌, పూజా, ప్ర‌సాదం సేవ‌లో వంశీధ‌ర్ గౌడ్‌, క‌ల్ప‌న‌, శ్రీ ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి వ‌స్త్రాలంక‌ర‌ణ సేవ‌లో లింగ‌మూర్తి, ల‌త‌, ప్ర‌సాద ‌సేవ‌లో శేష‌గిరిరావు, సువ‌ర్ణ‌లు భాగ‌స్వామ్యం‌ ‌అయ్యారు.

సామూహిక అక్ష‌రాభ్యాసంలో భాగంగా చిన్నారుల‌చే అక్ష‌రాలు దిద్దిస్తున్న వారి త‌ల్లితండ్రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here