గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పర్యటించారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడ కైతమ్మకుంటను ఆయన ఇరిగేషన్ ఏఈ నాగరాజుతో కలిసి సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో కుంట అవుట్ లెట్ పూడుకుపోయింది. దీంతో ఔట్ లెట్‌ను జేసీబీతో దగ్గరుండి శుభ్రం చేయించారు.
అలాగే ఖాజాగూడ పెద్ద చెరువును కూడా కార్పొరేటర్ సాయిబాబా సందర్శించారు. భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో బతుకమ్మలను చెరువులో వదిలేందుకు మహిళలకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించి చెరువు వద్ద ర్యాంప్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ వెంట హెచ్ఆర్‌డీసీఎల్ ఎస్ఈ రహమాన్, ఈఈ సర్దార్ సింగ్ తదితరులు ఉన్నారు.