- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ లో నమోదు చేసిన 500 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 2017 కన్నా ముందు డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా అందుకు సమానమైన డిప్లొమా చేసిన వారు పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చని, ఆన్‌లైన్‌లో లేదా సమీపంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు పత్రాలను అందజేయవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, పాండు గౌడ్, మురళి, మున్నా, షాకత్ అలీ, బోయ కిషన్, యాదగిరి, రవి, రాంచందర్, శ్రీను, అంజలి తదితరులు పాల్గొన్నారు.