ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ PJR నగర్ కాలనీ లోని పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ న్యూ PJR నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో పాదయాత్ర చేపట్టామని, ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు.  కాలనీ లో నెలకొన్న ఔట్ లెట్ సమస్యను, డ్రైనేజి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షకాలం సమయంలో వర్షపు నీటి నిల్వ వల్ల రహదారులపై రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలపై కాలనీ వాసులు ప్రభుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకురావడంతో.. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొండాపూర్ డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్ ,AE జగదీష్, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , జలమండలి DGM నారాయణ, మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, నరేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

న్యూ PJR నగర్ కాలనీ లో పాదయాత్ర చేపట్టి కాలనీవాసులు సమస్యలను తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here