రూ. 15 లక్షలతో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన
  • నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
  • త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ లో చేపట్టనున్న మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సీడీపీ నిధులు రూ.15 లక్షల అంచనా వ్యయం తో పనులు చేపట్ట నున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోపి నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే  సీడీపీ ఫండ్స్ 15 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగినదని తెలిపారు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. పేద , మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ మినీ ఫంక్షన్ హాల్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు, జన్మదిన వేడుకలు, వివాహాలు, షష్టిపూర్తి వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం  సంతోషంగా ఉందన్నారు. మినీ ఫంక్షన్ హాల్ ను అన్ని హంగులతో , సకల సౌకర్యాలతో నిర్మించడం జరుగుతుందని, నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశించారు. ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి సహకరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీకి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామని, అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ  శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు.

కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ తో కలిసి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ కార్యక్రమంలో TSRICL AE చందు, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు అబీబ్ , చింతకింది రవీందర్ గౌడ్, పొడుగు రాం బాబు, పద్మారావు, విరేశం గౌడ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, యాదా గౌడ్, KN రాములు, రమణ, గోపి కృష్ణ, గోపాల్ యాదవ్, నర్సింహ రెడ్డి, బసవరాజు సంతోష్, శ్రీ కళ, కవిత, పర్వీన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీని సన్నానిస్తున్న దృశ్యం.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here