హఫీజ్ పెట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్, రామకృష్ణ నగర్ లు తీవ్రంగా ముంపుకు గురయ్యాయి. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆయా ప్రాంతాల్లో బుధవారం ఉదయం పర్యటించారు. డి.ఆర్.ఎఫ్ మరియు జి.హెచ్.ఎం.సి సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.