నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106 శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో కొన్ని రోజులుగా తాగడానికి నీళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోర్డినేటర్ శామ్యూల్ కార్తీక్ ట్విట్టర్ ద్వారా సంబంధిత HMWDS, GHMC అధికారులతో పాటు స్థానిక శాసనసభ్యులు, మునిసిపల్ శాఖ మంత్రికి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి, అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేరిపేటి జైపాల్, కోర్డినేటర్ రఘునాధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సమస్య తీవ్రతను గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులూ తక్షణమే మరమ్మతులు చేయాలనీ డిమాండ్ చేస్తూ, నీళ్ళ కోసం అల్లాడుతున్న ప్రజలకు జేరిపేటి జైపాల్ ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజల నుండి మన్నలను అందుకున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన అధికారులకు శామ్యూల్ కార్తీక్ ధన్యవాదములు తెలుపుతూ, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజల అవసరం తీర్చాలన్నా ఉద్దేశమే తప్ప రాజకీయ లబ్ది కోసం చేయలేదని, కేవలం ఎన్నికల అప్పుడు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాం, మహిళలు బిందె పట్టుకొని బయటకు రాకుండా చేశాం అని మాటలు మాత్రమే చెప్పి ఆ పూటకు కనిపించే నైజం కాంగ్రెస్ పార్టీ లేదని, అధికారం ఉన్న లేకున్నా ప్రజల పక్షాన నిలబడడం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అని విమర్శకులకు చురకులు అంటించారు. సమస్య పరిష్కార దిశగా మాత్రమే పని చేయాలనీ, రాజకీయం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ జనాబ్ జహంగీర్, అజిమ్ ఖాన్, అయాజ్ అహ్మద్ ఖాన్, యువజన కాంగ్రెస్ సూర్య రాథోడ్, సాయి పాల్గొన్నారు.