చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో సోమవారం రాత్రి కురిసిన భారివర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధానంగా దీప్తీ శ్రీనగర్, సత్యనారాయణ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. కాగా విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి సోమవారం రాత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వర్షపు నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా సత్యనారాయణ ఎన్‌క్లేవ్ వద్ద మంగళవారం ఉదయం వరకు వరదనీరు నిలిచి ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.