కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల కొరకు ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటును నమోదు చేసుకోవాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పిలుపునిచ్చారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీ, రాఘవేంద్ర కాలనీలలోని పలు అపార్ట్మెంట్స్ కు వెళ్లి పట్టభద్రులను కలసి ఫారం 18 అందజేశారు. పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని, త్వరలో జరగబోయే ఎమ్యెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. కొండాపూర్ డివిజన్‌లోని ప్రతి కాలనీ, బస్తీలలో పర్యటించి గ్రాడ్యుయేట్స్ ని కలసి, ఓటరు నమోదు ప్రక్రియ పట్ల అవగాహనా కల్పించటం జరుగుతున్నదని తెలిపారు. కొండాపూర్ డివిజన్ లోని తెరాస నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులచే ఓటురు నమోదుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూపల్లి శ్రీనివాస్ రావు, రాజా రాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, వినోద్, కొండపల్లి సురేష్, పుల్లారెడ్డి, అనిత, ప్రశాంత్, ఏం సూర్యనారాయణ, రామ్ మోహన్, ఎల్. ప్రభాకర్ గౌడ్, యూత్ నాయకులు దీపక్, జి.శ్రీను, ప్రవీణ్, స్వర్ణేశ్, ప్రకాష్ రావు, జీవన్, రాజేష్, కాలనీ వాసులు ఉన్నారు.