క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు రాగం సుజాత యాద‌వ్ అభినంద‌న‌లు

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న రాగం సుజాతా నాగేందర్ యాద‌వ్‌, యువ‌నేత రాగం అనిరుధ్ యాద‌వ్‌

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రతి పక్షాలకు డిపాజిట్ దక్కకుండా భారీ మెజార్టీతో విజయం సాధించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేంద‌ర్‌ యాదవ్, టీఆర్ఎస్ యువజన నాయకులు రాగం అనిరుద్ యాద‌వ్‌లు క‌లిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత గారికి మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి, ఎంపిగా పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించిన ఘ‌న‌త క‌విత‌క్క‌కే ద‌క్కుతుంద‌ని సుజాత యాద‌వ్ పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా మహిళలను, యువతీ యువకులను ప్రేరేపించి తెలంగాణ పండగైన బతుకమ్మ కీర్తిని దేశవిదేశాలలో చాటి చెప్పిన ఆద‌ర్శ మ‌హిళ‌ కల్వకుంట్ల కవిత అని కొనియాడారు. భ‌విష్య‌త్తులో ఆమె మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here