నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ యూత్ అధ్యక్షుడు దొంతి కార్తీక్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దొంతి కార్తీక్ గౌడ్ జన్మదినం సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు బుక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ తల్లిదండ్రులు దొంతిరాధా సత్యం గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, నరేంద్ర బల్లా, దాస్, విఘ్నేష్, శ్రీను, ప్రేమ్, తదితరులు ఉన్నారు.