నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లో బ్రహ్మ కుమారీస్ వారి కల్పతరూహ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. 50 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్రహ్మ కుమారిస్ వారు 75 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న 55 వేల బ్రహ్మ కుమారిస్ సెంటర్లలో ఒక్కొక్క సెంటర్ లో 75 మొక్కలు నాటి దేశవ్యాప్తంగా 40 వేల మొక్కలు నాటాలని సంకల్పించుకోవడం అభినందనీయమని అన్నారు. జున్ 5 వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు 75 రోజుల్లో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, పరిరక్షించాలని పిలుపునివ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామచందర్, వార్డు మెంబర్ కవిత, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, బి.కే జ్యోతి, బి.కే పద్మ, బి.కే సౌజన్య, బి.కే సాగర్, బి.కె మోహన్, తదితర బ్రహ్మకుమారిస్ సభ్యులు పాల్గొన్నారు.