నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు వస్తాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ బస్తీ దవాఖానలో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, కిట్స్ ను రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. మన దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారందరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు. కోవిడ్ -19 అనంతరం సాంఘికంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరికి చేయూతనందించేందుకు చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ వంతు సహాయాన్ని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఫర్వీన్, బస్తీ కమిటీ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, బసవరాజు లింగాయత్, రామచందర్, అలీం, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ సీనియర్ ప్రోగ్రామర్ డాక్టర్ శ్రీశైలం, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్ గ్రేస్, కమ్యూనిటీ మొబలైజర్ షాబాన, స్థానిక కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.