సీఎంఆర్ఎఫ్ పథకం‌ పేదలకు వరం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు గొప్ప వరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో నివసిస్తున్న రవి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 40 వేల ఆర్థిక‌సహాయం చెక్కను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు నిరంతరం సేవలను అందించడం జరుగుతుందని‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు కాశీనాథ్ యాదవ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here