నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో కోడలు గొడవపడిందని అత్త ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం చందానగర్ శ్రీదేవి థియేటర్ రోడ్డు సాయి రాఘవ ఎన్ క్లేవ్ బ్లాక్ బి, ఫ్లాట్ నంబర్ 502 లో ఎన్. ఆదిలక్ష్మీ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈ నెల 24 వ తేదీన ఆదిలక్ష్మీ, కోడలు మధ్య గొడవ జరగడంతో అవమానంతో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఇంట్లోనే నగలు వదిలిపెట్టి లెటర్ రాసి వెళ్లింది. చుట్టు పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కొడుకు ఎన్.నాగేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.