నమస్తే శేరిలింగంపల్లి: అవని స్వచ్ఛంద సంస్థ వ్యస్థాపకురాలు శిరీష సత్తూర్ కుమార్తె శాన్వి పుట్టిన రోజు వేడుకలను పీజేఆర్ నగర్ లో నిర్వహించారు. పీజేఆర్ నగర్ కు చెందిన మేఘన అనే పేద విద్యార్థిని విద్యాభ్యాసం కోసం శాన్వి చేతుల మీదుగా రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అవని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శిరీష సత్తూర్ మాట్లాడుతూ ఆడపిల్ల చదువు, అభివృద్ధి, విద్య కోసం తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అవని స్వచ్ఛంద సంస్థ చేసిన సేవలను గుర్తించి పీజేఆర్ నగర్ కాలనీ వాస్తవ్యులు శిరిష సత్తూర్ ను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ సత్తూర్ నవీన్ కుమార్, సంగమేష్, శ్యామ్, సుందర్, దొరబాబు, తిరుపతి, శ్రీనివాస్, రమేష్, తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.






