నమస్తే శేరిలింగంపల్లి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి అన్ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్క్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత దేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని కాలనీ అధ్యక్షుడు ఖాసీం, కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ 2002 అధ్యక్ష ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాష్ట్రపతిగా నియామకమై దేశానికి అందించిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అన్నారు. అబ్దుల్ కలామ్ అడుగుజాడల్లో యువత నడిచి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలామ్ 3వ వాడు అన్ని అన్నారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారన్నారు. భారతదేశం మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981 లో పద్మ భూషణ్, 1990 లో పద్మ విభూషణ్ తో సత్కరించిందన్నారు.
అనంతరం గుల్ మొహర్ పార్క్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుల్ మొహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు ఖాసిం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గుల్ మొహర్ పార్క్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ నిరజన్ రెడ్డి, అడ్వైజర్ జై రాజ్ సింగ్ , రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు రాంచందర్ యాదవ్, నేతాజీ నగర్ కాలనీ ఉప అధ్యక్షులు రాయుడు , కాలనీ వాసులు పాల్గొన్నారు.