నమస్తే శేరిలింగంపల్లి: కూకట్పల్లి డివిజన్ ఆజ్ బెస్టాస్ కాలనీలోని బిర్లా ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన వెయ్యి మంది కార్యకర్తలు బిజెపిలోకి చేరారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి బిజెపి కండువాలు కప్పి ఆహ్వానించారు.
దేశ ప్రధాని మోడీ మన దేశాన్ని ప్రపంచ పఠంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో తెలంగాణను అప్పులతో దివాళా తీయిస్తున్నారని వాపోయారు. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో, మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. బిజెపి చేపట్టిన పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన నాయకులు బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో నరేష్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహ చారి, రమేష్ యాదవ్, రఘునాథ్, యాదవ రెడ్డి, వెంకట స్వామి రెడ్డి, శేఖర్, అరుణ, జ్యోతి, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, నర్సింగ్ యాదవ్, వేణు యాదవ్, శ్రీధర్ పటేల్, శ్రీనివాస్ గౌడ్, మురళి, విజ్జిత్ , శ్రీలత, బాలు యాదవ్, రాజిరెడ్డి, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.