తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణలో మార్పు తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) వార్షికోత్సవంలో పాల్గొనే ముందు బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బిజెపి కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వహించారు. తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పార్టీల నుంచి విముక్తి ల‌భించాల‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల అభిమాన‌మే త‌న బ‌లమ‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆప్యాయ‌త‌కు రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. ఒక కుటుంబ పాల‌న కోసం తెలంగాణ ఉద్య‌మం జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణ‌ను కుటుంబ పాల‌న‌లో బంధించాల‌నుకుంటున్నార‌న్నారు. తెలంగాణ‌ను విచ్ఛిన్నం చేసే వాళ్లు నాడు, నేడు ఉన్నార‌న్నారు. తెలంగాణ‌ను టెక్నాల‌జీ హ‌బ్ గా చేయాల‌నుకుంటున్నామ‌ని చెప్పారు. యువ‌త‌తో క‌లిసి తెలంగాణ‌ను ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకెళ్తాం అన్నారు. ద‌శాబ్దాల‌పాటు జ‌రిగిన తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నో బ‌లిదానాలు జ‌రిగాయ‌న్నారు. ఒక కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అణ‌చి వేస్తోంద‌న్నారు. వార‌స‌త్వ రాజకీయాల‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని మోడీ పిలుపునిచ్చారు. పేద‌ల స‌మ‌స్య‌లు కుటుంబ పార్టీల‌కు ప‌ట్ట‌వ‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, నాయకులు మొవ్వ సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, డి ఎస్ ఆర్ కె ప్రసాద్, విజిత్, నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ, శ్రీధర్ రావు, కమలాకర్ రెడ్డి, కృష్ణ, మహిపాల్ రెడ్డి, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here