నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలి – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ లో నాలా విస్తరణలో భాగంగా సత్యనారాయణ ఎన్ క్లేవ్ వద్ద రూ. కోటి 55 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తున్నామని అన్నారు‌.

నాలా నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని పనులలో వేగం పెంచాలని సూచించారు. నాలా నిర్మాణ పనులపై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని అన్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపునకు గురికాకుండా ముందస్తు తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగన్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు నరేంద్ర బల్లాల తదితరులు పాల్గొన్నారు.

నాలా విస్తరణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here