రంజాన్ కానుకలను అందజేసిన రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని సీఎం‌ కేసీఆర్ ముస్లింల కోసం పంపించిన రంజాన్ తోఫాలను చందానగర్ డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల మసీదులలో పని చేస్తున్న ఇమామ్, మౌజన్ లకు చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి అందజేసి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి సంవత్సరం రంజాన్ కానుకలతో పాటు దసరా, క్రిస్మస్ పండగలకు‌ బట్టలను అందజేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.‌ తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎనిమిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముసా, బాబర్, మహ్మద్ ముజాహిర్, యండి రజా, మజర్ అహ్మద్, ఇమ్రాన్, ఖఫిల్ ఖాన్, అక్బర్ ఖాన్, అల్తాఫ్, బాబ్బు, ఖాదర్, ఇమ్రాన్ సికందర్, అఖిల్, దస్తగిరి, అఫ్సర్, ఉమ శంకర్, ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ తోఫాలను అందజేసిన చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here