నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతిని చెల్లించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, మొవ్వ సత్యనారాయణ మాట్లాడుతూ నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరలేదని అన్నారు. 2014 సంవత్సరం నుంచి నేటికి పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ. 3016 ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదన్నారు.
ఇప్పటివరకు 40 నెలల మొత్తం రూ. లక్షా 20 వేల 640 చొప్పున ప్రతి నిరుద్యోగికి భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర నాయకులు నిరటి చంద్రమోహన్, హరిప్రియ,బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్, బిజెవైఎం జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్, బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ అమర్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్, శివ కుమార్, డివిజన్ నాయకులు సామ్రాట్ గౌడ్, రాఘవేంద్ర ముదిరాజ్ , మధు, శ్రావణ్, కుమార్, లోకేష్, వంశీ, హర్షిత్, బోయినపల్లి శ్రీకాంత్, మహేష్, రాము, వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.