నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. చందానగర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. చందానగర్ డివిజన్ పరిధిలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. రంజాన్ పండగను పురస్కరించుకుని కాలనీలలో చేపట్టిన ప్రత్యేక పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను, కొత్తగా చేపట్టనున్న పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆయా కాలనీలలో నెలకొన్న సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల సమస్యలను వెంటనే తీర్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఈఈ శ్రీకాంతి, ఏఈ శివరాం, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.