– హైటెక్ సిటి సర్కిల్ వద్ద అక్రమ నిర్మాణం కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబర్ టవర్స్ ఎదురుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జులిపించారు. “అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సీరియస్.. అధికారులు కేర్ లెస్..” శీర్షికతో గురువారం “నమస్తే శేరిలింగంపల్లి”లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా కథనానికి స్పందించిన చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. సెక్షన్ అధికారి మధు నేతృత్వంలో సదరు నిర్మాణాన్ని సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఏసీపి సంపత్ హెచ్చరించారు.