- పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్
- బతుకమ్మ పండగకు ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని చీరల పంపిణీ
- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆడబిడ్డలు ఆరాధించి, అభిమానించే పండుగ బతుకమ్మ పండుగ అని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందజేసిన చీరలను శుక్రవారం ఆమె మొదటి రోజు వేమన వీకర్ సెక్షన్ కాలనీలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రపంచమంతా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నా పేదలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని ఆపలేదన్నారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ చేపట్టారని తెలిపారు. ప్రజల గురించి ఇంత గొప్పగా ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారన్నారు. చందానగర్ డివిజన్ లో సుమారుగా 9940 చీరల పంపిణీ చేపట్టడం జరుగుతుందని, డివిజన్ లో 9 సెంటర్లలో 5 రోజుల పాటు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఈ చీరలను ఆడబిడ్డలకు అందిస్తామన్నారు.
చందానగర్ డివిజన్ లో సెంటర్లు, వాటిలో అందించే చీరల వివరాలు…
వేముకుంట మహిళ భవనం – 1129
ఇందిరా నగర్ మహిళ భవనం – 1179
పీజేఆర్ స్టేడియం – 1001
రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్ – 1326
జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్ – 1009
దీప్తి శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్ – 1070
అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ – 3226
మొత్తం 9940 చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు జ్యోతి, జ్ఞాన, శబనా, ఉమ, మౌనిక, పోచయ్య, శ్రీకాంత్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.